రెహ్మాన్ ఇళయరాజా రికార్డు బ్రేక్ చేశాడా..?

Saturday, April 14th, 2018, 12:14:43 PM IST

భార‌తీయ సినీ క‌ళాకారుల‌కి క‌ల‌గా మిగిలిన ఆస్కార్‌ని రెండు సార్లు సాధించి స‌త్తా చాటిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈయ‌న గ‌తంలో రోజా, క‌న్న‌త్తిల్‌, ముత్త‌మిట్టాల్‌, మిన్సార క‌న‌వు, ల‌గ‌న్ చిత్రాల‌కి జాతీయ పుర‌స్కారాల‌ని అందుకున్నారు. తాజాగా కాట్రు వేలియిదై చిత్రానికి గాను జాతీయ పుర‌స్కారానికి ఎంపిక అయ్యారు రెహ్మాన్‌. దీంతో మొత్తం ఆయ‌న జాబితాలో జాతీయ పుర‌స్కారాల సంఖ్య ఆరుకి చేరింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు జాతీయ అవార్డుల‌ని అందుకోగా, ఆయ‌న రికార్డుని బ్రేక్ చేశాడు ఏఆర్ రెహమాన్‌. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంటున్న ఏఆర్ రెహ‌మాన్ సంఘ‌మిత్ర అనే భారీ బ‌డ్జెట్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. ఈ చిత్రంతో మ‌రో అవార్డు త‌న ఖాతాలో వేసుకోనున్నాడ‌ని అభిమానులు అంటున్నారు. యేసుదాసు ఇప్ప‌టికి ఎనిమిది సార్లు జాతీయ అవార్డు గెలుచుకుని తొలిస్థానంలో ఉండ‌గా, బాలు, ఏఆర్ రెహ‌మాన్‌ ఆరుసార్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. 2017లో విడుద‌లైన మ‌ల‌యాళ సినిమా `విశ్వ‌స‌పూర్వం మ‌న్సూర్‌`లోని `పోయిమ‌రంజ‌కాలం` పాట‌కుగానూ యేసుదాసు ఎనిమిదోసారి ఈ అవార్డు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments