రెజీనా … ఓ అందమైన దయ్యం ?

Tuesday, November 29th, 2016, 11:03:07 PM IST

rejina
దయ్యం .. అందంగా ఉండడం ఏమిటి ? మీ పిచ్చి కాకపొతే .. !! అని అనుకుంటున్నారా….. నిజమే దయ్యాలంటే మనలను బయపెడతాయని తెలుసు .. కానీ ఈ దయ్యం మాత్రం .. చుసిన వారిని తన ప్రేమలో పడేస్తుంది? మీరు ఒక్కసారి ఆ దయ్యాన్ని చూశారంటే .. అబ్బా అంత అందంగా ఉంది .. అనుకోవలసిందే ! నిజం .. ఇంతకీ రెజీనా దయ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా .. అక్కడికే వస్తున్నా .. గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న రెజీనా మరో వైపు తమిళంలో కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్కడ తన క్రేజ్ నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు తొలిసారి ఓ హర్రర్ సినిమాలో నటిస్తుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే చిత్రం ”నింజామ్ మారప్పతిల్లై”, ఈ సినిమాలో రెజీనాతో పాటు ఇటీవలే నిఖిల్ హీరోగా వచ్చిన ”ఎక్కడికి పోతావు… ” సినిమాలో నటించిన నందిత శ్వేతా కూడా ఉందట. ఇందులో రెజీనా దయ్యంగా కనిపిస్తుందని అంటున్నారు, ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తీ కావొచ్చిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. లేటెస్ట్ గా రెజినా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు, అందమైన దయ్యం గా రెజీనా లుక్ అందరిని ఆకర్షిస్తుంది!! మరి ఈ సినిమాతో రెజీనా అందరిని బయపెడుతుందో లేదో చూడాలి !