నాగ్ – నానిల మల్టి స్టారర్ కి డేట్ కుదిరింది ?

Sunday, May 20th, 2018, 05:06:49 PM IST

అక్కినేని నాగార్జున – నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టి స్టారర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 12న విడుదల చేస్తారట. ఇప్పటికే టాలీవుడ్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా పూర్తీ స్థాయి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా అటు బిజినెస్ వర్గాల్లో కూడా ఆసక్తి రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments