కాటమరాయుడు .. విడుదల డేట్ లాక్ ?

Monday, November 28th, 2016, 11:41:24 PM IST

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లేటెస్ట్ గా ప్రారంభం అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ”సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా భారీ పరాజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే దిశగా ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఈ సినిమా తరువాత అటు త్రివిక్రమ్, ఇటు .. నేసన్ దర్శకత్వంలో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు కాబట్టి అవికూడా వీలైనంత త్వరగా పూర్తీ చేయాలనీ ట్రై చేస్తున్నారు. ఇక డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాటమరాయుడు’ సినిమా వచ్చే మార్చ్ 28 న విడుదల చేయాలనీ డేట్ లాక్ చేసారని తెలిసింది. వచ్చే ఉగాది కానుకగా ఫాన్స్ ను అలరించడానికి ‘కాటమరాయుడు’ వస్తున్నాడు.