విడుదలయి పది రోజులయింది……కలెక్షన్లు రూ.6600 కోట్లు

Sunday, May 6th, 2018, 10:05:50 PM IST


గతవారం మంచి అంచనాల మధ్య విడుదలయిన భారీ హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. విడుదలయిన మొదటి రోజునుండి ఈ చిత్రం మంచి హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కలెక్షన్ల సునామీకి కొన్నాళ్ల వరకు బ్రేక్ పడేలా లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అదరగొట్టే గ్రాఫిక్స్, అలానే సూపర్ హీరోల అద్భుత నటన చిత్రాన్ని ఇంతపెద్ద విజయతీరాలకు చేర్చిందని అంటున్నారు.

ముఖ్యంగా పిల్లలు, యువత, మహిళలు అని తేడాలేకుండా ఈ చిత్రాన్ని అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మన దేశంలోని మల్టీ ప్లెక్స్ లలో టిక్కెట్లు లు దొరకని పరిస్థితి. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు మొత్తం ఒక బిలియన్ డాలర్ల కలెక్షన్ పొందినట్లు సమాచారం. అంటే మన భారత దేశ డబ్బు ప్రకారం అక్షరాలా రూ. 6600 కోట్లు అన్నమాట. ఇప్పటివరకు ప్రపంచంని ఏ చిత్రం కూడా ఇంతవేగంగా ఈ కలెక్షన్ అందుకోలేదు. అయితే తొలి వారాంతంలో కేవలం ఇండియాలో ఇప్పటివరకు రూ.120 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ చిత్రం త్వరలో రూ.200 కోట్లు చేరుకుంటుందని ఇక్కడి సినీ వర్గాలు అంటున్నాయి.

కాగా రెండవ వరం లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం మరిన్ని రోజులు ఇదే జోరును కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిస్నీ, మర్వెల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో మొత్తంగా రెండు బిలియన్ డాలర్లను కొల్లగొడుతుందని అంచనా. ధానోస్ అనే భయంకరమైన విలన్ ని ఢీకొట్టేందుకు 22 మంది సూపర్ హీరోలు కలిసి అతని పై చేసే పోరాటమే ఈ చిత్ర మూల కథాంశం……