బిగ్ బాస్ 3 సీజన్లో రేణు దేశాయ్ కూడానా?

Sunday, June 9th, 2019, 11:15:34 PM IST

ఇప్పటికే చాలా గ్యాప్ రావడంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ మూడవ సీజన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.గడిచిన రెండు సీజన్లు కూడా మంచి ఎంటర్టైనింగ్ గా మరియు ఆసక్తికరంగా సాగడంతో ఇప్పుడు మూడో సీజన్ ఎలా ఉండబోతుందా అని అంతా అనుకుంటున్నారు.ఈ సందర్భంలోనే ఇప్పటికే ఈ సీజన్ కు హోస్ట్ గా కింగ్ నాగార్జున ఖరారు అయ్యిపోయారని అనధికారిక వార్తలు కూడా బయటకు వచ్చేసాయి.అంతే కాకుండా ఈసారి బిగ్ బాస్ లో చాలా మంది ప్రముఖ నటులే కనిపించబోతున్నారని కూడా వార్తలొచ్చాయి.

వారిలో శ్రీముఖి,రఘు మాస్టర్ వైవా హర్ష ప్రముఖ సినీ నటుడు జాకీ అలాగే హీరో వరుణ్ సందేశ్ ఇలా చాలా మంది ప్రముఖ నటుల పేర్లే వినిపించాయి.అయితే తాజాగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ పేరు కూడా వినిపిస్తుంది.ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఈమె పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది.అయితే మరో పక్క రేణు పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని మరికొంత మంది కూడా అంటున్నారు.మరి ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు మ్యాటర్ ఏమిటి అన్నది కూడా తేలిపోతుంది అని బిగ్ బాస్ ప్రేమికులు కూడా అనుకుంటున్నారు.