తెలుగు మీడియా దుష్ప్రచారంపై రేణు దేశాయ్ ఆవేదన.!

Saturday, February 15th, 2020, 08:50:06 AM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయాక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.వీరిద్దరూ విడిపోయి తమ కొత్త జీవితాల్లో సుఖంగానే ఉన్నా సో కాల్డ్ మీడియా మాత్రం ఏదొక తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఆమెను మరింత కుంగదీస్తున్నారు.తెలుగులో ఉన్నటువంటి బడా మీడియా సంస్థలే కనీస డిటైల్డ్ సమాచారం లేకుండా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.దీనితో రేణు దేశాయ్ మరోసారి తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచారు.

తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అసలు ఒక వార్త ప్రచారం చేసే ముందు అది నిజమో కాదో తెలుసుకోకుండా చాలా పెద్ద పోస్టునే అందరికీ అర్ధం అయ్యేలా తెలుగులో పెట్టారు.అంతే కాకుండా తనపై ఈ దుష్ప్రచారం జరిపిన ప్రతీ ఒక్క స్క్రీన్ షాట్ ను వైరల్ అయిన ఈ వార్త మూలాన తనకు పర్సనల్ తెలిసిన వారు అడిగిన మెసేజ్ ల తాలూకా ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకొని తాను ఇలాంటి తప్పుడు వార్తల మూలాన ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుగు మీడియా సంస్థలు అర్ధం చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేసారు.ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే మన మీడియాలో మార్పు అనేది కష్టమే అని చెప్పాలి.