ఆ సమస్యలను పరిష్కరించుకుంటున్నా..ఒంటరితనం కష్టమే : రేణు దేశాయ్

Saturday, September 30th, 2017, 11:00:25 PM IST

జీవితం అనుకోకుండా మనకు కొన్ని దారులను చూపిస్తాయి. ధైర్యంతో ముందుకు సాగడమే మన పని. ఆ విధంగా తన జీవితాన్ని సాగిస్తాను అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. అనుక్షణం అమ్మ చెప్పిన మాట నా మనస్సులో కదులుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు నేను మర్చిపోలేదు. అంతే కాకుండా అనుక్షణం దాన్ని ఆచరిస్తున్నాను. ఎవరో ఎదో మాట్లాడుతున్నారని అబద్దం చెప్పలేను. ఎల్లప్పుడూ నిజమే మాట్లాడుతాను. ఆ విధానాన్ని మా అమ్మ నేర్పిందని తెలిపారు.

అలాగే ఇంకొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ఆమె తెలిపింది. నా పిల్లలే నా జీవితం. వారికంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటాను. ఒంటరితనం అప్పుడపుడు బాధిస్తున్నా.. అన్ని విషయాలను స్వీకరించి, అలోచించి ముందుకు సాగాలి తప్ప మధ్యలోనే ఆగిపోకూడదని వివరించారు. ఇక వారి పిల్లల గురించి మాట్లాడుతూ..మా అబ్బాయి అకిరా ఎప్పుడు నాతో ఫ్రెండ్లి గా ఉంటాడు. ఇద్దరం మంచి స్నేహితుల్లా ఉంటాము. ఇక మా అమ్మాయి ఆద్య మాత్రం కొంచెం నన్ను తల్లిగానే ప్రేమగా చూస్తుందని రేణు దేశాయ్ వివరించారు.

Comments