పవన్ పాటపై రేణుదేశాయ్ పోస్ట్..!

Monday, September 17th, 2018, 04:51:52 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో తన పాత జ్ఞ్యాపకాలను మళ్ళీ నెమరు వేసుకున్నారు. 2001 లో విడుదల అయ్యిన “ఖుషి” చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. మణిశర్మ అందించిన బాణీలతో అప్పటి పాటలలో ఒక కొత్త ట్రెండ్ నే సృష్టించారు అని చెప్పాలి. ఇప్పటికి ఆ చిత్రం లోని పాటలకి ఎలాంటి ఆదరణ ఉందో వేరే చెప్పక్కర్లేదు.. ఐతే ఈ చిత్రంలోని “ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే” అనే పాటను గుర్తు చేసుకుంటూ రేణుదేశాయ్ పోస్ట్ పెట్టారు.

ఆ చిత్రానికి రేణుదేశాయ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసారు అని తెలిపారు, ఆ పాటలోని ఒక పెద్ద శునకం ఉంటుంది మీకు గుర్తుందా..?ఆ శునకంను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు ఆ పాటని అప్పుడు న్యూజిలాండ్ లోని చిత్రీకరించడానికి వెళ్ళినపుడు తీసుకువచ్చారని దాని పేరు బెల్లీ అని తెలిపారు. ఆ పాట షూటింగ్ సమయంలో దాన్ని చూసి అందరు భయపడేవారు అని తెలిపారు.దానితో దాన్ని రెండు రోజులు వరకు తానే దాని ఆలనా పాలనా చూసుకున్నాను అని తెలిపారు.ఖుషి చిత్రం షూటింగ్ సమయం లో రేణుదేశాయ్ కేవలం 19 ఏళ్ళ వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను అని అవన్నీ తన జీవితంలో మధుర జ్ఞ్యాపకాలు అని తన ఆనందాన్ని పంచుకున్నారు.