దర్శకురాలిగా మారుతున్న పవన్ మాజీ భార్య ?

Friday, July 27th, 2018, 07:51:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య , ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ దర్శకురాలిగా మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకే ఆమె మరాఠి లో దర్శక నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజగా రేణు దేశాయ్ దర్శకురాలిగా మారేందుకు రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఆమె చేసేది తెలుగులోనే కావడం విశేషం. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టనున్నట్టు తెలిపారు. అయితే రేణు దేశాయ్ .. టాలీవుడ్ లోకి నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై రేణు స్పందించింది. తాను తెలుగులోకి నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని .. తాను దర్శకురాలిగా అడుగు పెడుతున్నానని చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం అయిందని, మాటల ను రాస్తున్నానని .. సంక్రాంతి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతానని చెప్పింది. అయితే తాను తెరపై కనిపించనని కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తానని క్లారిటీ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments