రేణు దేశాయ్ నిర్ణయానికి షాక్ అవుతున్న నెటిజన్లు – కారణం ఏంటో…?

Friday, June 14th, 2019, 01:35:26 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా కనిపించబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు చాలా వస్తున్నాయి… కాగా తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం రేణు దేశాయ్ బిగ్ బాస్ లో కనిపిస్తున్నారన్న మాట వాస్తవమే కానీ తానూ కనిపించబోతుంది కంటెస్టెంట్ గా కాదంట. ఈ షో కి తానె హోస్ట్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. ఇదివరకు వచ్చిన షో లలో మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ గ కనిపించరు. రెండవ సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా కనిపించి ప్రేక్షకులని అలరించారు.

అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి మూడవ సీజన్ లో మాత్రం రేణు దేశాయ్ హోస్ట్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. కాగా ఈ విషయం మీద రేణుదేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన నిజాలను భయటపెట్టారు. బిగ్ బాస్3 సీజన్ కోసం తనను చాలా మంది సంప్రదించారని ఇంకా నేను వారికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే తనకి కంటెస్టెంట్ గా రావడం కంటే హోస్ట్ గా వ్యవహరించడమే ఇష్టం అని చెప్పుకొచ్చిందంట. అంటే ఈ విషయాలను అన్నింటిని గమనిస్తే రేణుదేశాయ్ ఈ షో లో కనిపించడం లేదని తెలుస్తుంది.