బతుకమ్మ క్షమిస్తుందా?

Monday, September 15th, 2014, 03:53:46 PM IST


హైదరాబాద్ జలవిహర్ లో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద రోజుల పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెయ్యి అబద్ధాలు ఆడారని తీవ్రంగా ఆరోపించారు. రైతు రుణమాఫీపై ఇప్పటికీ కెసిఆర్ స్పష్టత నివ్వలేదని, రాష్ట్రంలో 178మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రేణుక దుయ్యబట్టారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ రైతులను ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమిస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే ఎంఐఎంతో సంబంధం లేకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని రేణుక ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.