కాస్టింగ్ కౌచ్ పై రేణుక చౌదరి, సరోజ్ ఖాన్ ల షాకింగ్ కామెంట్స్!

Wednesday, April 25th, 2018, 03:38:14 AM IST

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అంశం టాలీవుడ్ ని తీవ్ర స్థాయిలో కుదిపేస్తోంది. తొలుత వర్ధమాన నటి గాయత్రి గుప్తా, అలానే మాధవీలత, తరువాత శ్రీరెడ్డి ఇలా పలువురుఅమ్మాయిలు టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు అవకాశలకోసం వస్తుంటే పలువురు తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఈ విధమైన నీచ సంస్కృతి పోవాలని వారు పోరాడుతున్నారు. అయితే శ్రీరెడ్డి మరింతగా ఒకడుగు ముందుకు వేసి తన అర్ధ నగ్న ప్రదర్శనతో మా సంఘం దృష్టిలో పది తొలుత నిషేధం విధింపబడి, తరువాత వారి ద్వారానే మళ్లి సభ్యత్వారం సంపాదించారు. అయితే ప్రస్తుతం ఆమె లేవనెత్తిన ఈ అంశం తీవ్ర రూపం దాల్చింది. అయితే ఇదే అంశంపై శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

సినీ పరిశ్రమకు ఇటువంటి నిందలు ఆపాదించవద్దని, అసలు మన దగ్గర టాలెంట్ ఉంటే మన వొళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం లేదని, మంచి అవకాశం వచ్చే వరకు ఎదురుచూడగా తప్పదని అన్నారు. అయినా మనకు ఏదోవిధంగా మనకు సినీపరిశ్రమ కొంతవరకు తిండిపెడుతోంది కదా అని ఆమె అన్నారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే మొత్తానికి చివరకు ఆమె తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు.

కాగా నేడు ఇదే అంశం పై కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుక చౌదరి మాట్లాడుతూ అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడ లేదు చెప్పండి. కేవలం సినీ పరిశ్రమ లోనే కాదు, మనం పనిచేసే ప్రతి ఒక్కచోట ఉందని, అంతెందుకు పార్లమెంట్ లో కూడా ఇటువంటి వేధింపులు ఉన్నాయని ఆమె అన్నారు. అయితే ఈ అంశంపై ఇకనైనా దేశమంతా ఒక తాటిపైకి వచ్చి న్యాయపోరాటం చేయవలసిందని ఆమె వ్యాఖ్యానించారు…….

  •  
  •  
  •  
  •  

Comments