రిజర్వేషన్లు ఓకే కానీ, ఉద్యోగాలెక్కడ మోడీ గారు…?- ప్రశ్నించిన సూర్జేవాలా

Monday, January 7th, 2019, 09:30:12 PM IST

మనదేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం చాలా గొప్ప విషయమని, అందుకు మేము కూడా సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కానీ ఎన్నికల హామీలో భాగంగా మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఎక్కడ అని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఇప్పటికి 9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. మిగతా వారికీ ఇంకెప్పుడు ఇస్తారని కాంగ్రెస్ నాయకులూ సూర్జేవాలా ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్నీ తీవ్రంగా విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.

కేంద్ర కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కానీ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని’ నిలదీశారు. నిరుపేదలకు అవకాశాలు, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మొహం చాటేస్తోందని ఆయన అన్నారు. ‘ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? 24 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు? పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల కోల్పోయిన ఉద్యోగాల నష్టాన్ని ఎప్పుడు పూర్తిస్తారు? ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కానీ ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తారని’ సూర్జేవాలా నిలదీశారు.