రంగస్థలం కోసం రీ షూట్ ?

Saturday, January 20th, 2018, 11:05:42 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రాజమండ్రి లో ఓ పాట చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కోసం రీ షూట్ చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్? దాంతో ఈ విషయం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమా కోసం మొదట్లో గోదావరి జిల్లాల్లో చేసిన షూటింగ్ ఎక్కువ రోజులు చేయాలనీ అనుకున్నారు. కానీ ఫాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడం .. సినిమాలోని సన్నివేశాలకు సంబందించిన ఫోటోలు లీక్ అయి సంచలనం రేపడంతో, షూటింగ్ మార్చి హైదరాబాద్ లో విలేజ్ సెట్టింగ్ వేసి అక్కడే మిగతా సినిమా కంప్లీట్ చేసారు . అయ్యితే అక్కడ తీసిన కొన్ని సన్నివేశాలు బాగా రాకపోవడంతో దాన్ని గోదావరి జిల్లాలోనే రీ షూట్ చేయాలనీ సుకుమార్ ప్లాన్ చేసాడని, ఈ విషయం లో చరణ్ కూడా ఓకే అన్నాడట. ఈ నెల చివరి వారంలో షూటింగ్ మొదలు పెడతారట. ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్నటినుండే మొదలైంది. అయితే బోయపాటి సినిమాకు కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని రంగస్థలం షూటింగ్ లో పాల్గొంటాడట చరణ్.