రంగస్థలానికి రిపేర్లు .. ?

Thursday, February 22nd, 2018, 09:24:51 PM IST


రామ్ చరణ్ హీరోగా క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులలోను భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబుగా చరణ్ కొత్త లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. మరో వైపు సమంత కూడా అచ్చమైన పల్లెటూరి పడుచు రామ లక్ష్మి గా షాక్ ఇచ్చింది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమాకు రిపేర్లు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది ? తాజాగా సుకుమార్ , చరణ్ లు ఈ విషయం పై సీరియస్ గా ఉన్నారట. విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా చూసుకున్న చరణ్ కు సినిమాలో కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తే బెటర్ అనే ఆలోచన చెప్పాడట. అలాగే మెగాస్టార్ కూడా అసంతృప్తిగా ఉన్నాడట .. ఈ సినిమాకోసమే అయన సైరా షూటింగ్ వాయిదా వేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రంగస్థలానికి రిపేర్లు మొదలు పెట్టారంటే సినిమా విషయంలో తేడా కొడుతుందని ఓ వైపు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే యూనిట్ రెస్పాండ్ కావాలి.