ఏపీ లో రెసిడెంట్ జూనియర్ డాక్టర్ల సమ్మె… డిమాండ్లు ఇవే!

Wednesday, June 9th, 2021, 09:57:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నేటి నుండి రెసిడెంట్ జూనియర్ డాక్టర్లు సమ్మె షురూ చేశారు. విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించి ప్రభుత్వానికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇలా చేయడానికి గల కారణాలు లేకపోలేదు. ఆరోగ్య భీమా, ఎక్స్ గ్రేషియో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె మొదలు పెట్టారు. అయితే కోవిడ్ ప్రోత్సాహకాల తో పాటుగా, ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లను పెంచాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నేడు, రేపు,12 వ తేదీన అత్యవసర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వం తమ న్యాయ పరమైన డిమాండ్ లను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలి అని కోరుతున్నారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలకి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మరియు పీజీ రెసిడెంట్ స్పెషలిస్ట్ లకు నిన్ననే గౌరవ వేతనం ను పెంచడం జరిగింది. అయితే ఈ పెంపు సెప్టెంబర్ 2020 నుండి వర్తించనున్నట్లు తెలిపింది.