కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డికి పోటీగా మరో నేత..? అసలేమీ జరుగుతుంది

Sunday, August 25th, 2019, 01:36:34 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవి రేసులో మొదటి నుండి రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉన్నాడు. రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఎన్ని అడ్డుపుల్లలు వేసిన కానీ కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి వైపు మొగ్గుచూపుతోంది. రాహుల్ గాంధీ రాజీనామా విషయంలో గత కొద్దీ రోజులుగా గందరగోళములో ఉన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మళ్ళీ బాధ్యతలు తీసుకోవటంతో దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయటానికి నడుము బిగ్గించింది.

ఇందులో భాగంగా రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను మార్చాలని అనుకుంది. తెలంగాణలో ఉత్తమ కుమార్ రెడ్డి పదవి కాలం ముగిసిన కానీ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అతన్ని కొనసాగించింది. ఇక ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఫైనల్ చేశారని తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి పేరుతో జీవన్ రెడ్డి పేరుని కూడా అధిష్టానం చేరి ఇద్దరినీ ఫైనల్ లిస్ట్ లో పెట్టినట్లు తెలుస్తుంది.

అయితే 90% రేవంత్ రెడ్డి ఖాయమనే చెప్పాలి, ఏమైనా అనుకోని పరిస్థితులు ఎదురైతేనే జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తారని తెలుస్తుంది. ఒక వేళ ప్రస్తుతం జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసిన కానీ ఎన్నికల సమయానికి మాత్రం ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో యూత్ ఫాలోయింగ్ కలిగిన నేత రేవంత్ రెడ్డి ఒక్కడే అందుకే అతనికి ఈ బాధ్యతలు ఇవ్వాలని చూస్తుంది కాంగ్రెస్ ]