కేసీఆర్ కుటుంబం తెలంగాణ వారు కాదట.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Tuesday, September 26th, 2017, 10:55:41 AM IST


తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య వివాదాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొవడం కామన్. ప్రస్తుతం తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు అదే ఆలోచనతో ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలని ఆకర్షించే విధంగా అన్ని తరహాలో ఆలోచిస్తూ.. అవతలి పార్టీపై కౌంటర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత టీడీపీ మళ్లీ అధికార పార్టీపై కౌంటర్లు వేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా పార్టీ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కొన్ని కామెంట్స్ చేశారు.

రీసెంట్ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుత్తికోయల ప్రస్తావనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అక్కడ ఓ గెడెంలో పర్యటించిన అయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుత్తికోయలు వివాదం గత కొన్ని రోజులుగా అక్కడ సంచలనంగా మారింది. అయితే అక్కడ వారిని ఉండనివ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఈ సందర్బంగా కేసీఆర్ కూడా ఓ వలసదారుడని అయన కుటుంబానికి చెందిన పూర్వికులు మొదట బీహార్ కి చెందిన వారని అక్కడ నుంచే వచ్చారని చెబుతూ.. అయన కొడుకును గుంటూరులో చదివించారని తెలిపారు. ఇక ఎలాగైనా గుత్తికోయలకు న్యాయం జరిగేలా ఆ విషయాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశంలో లేవనెత్తుతానని వివరించారు. దీంతో వచ్చే అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయని నేతలు మాట్లాడుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments