తెరాసకి బీజేపీకి పోటీగా రేవంత్ రెడ్డి రంగప్రవేశం…వేట మొదలైందా..?

Friday, August 16th, 2019, 09:09:21 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఎవరు ఊహించలేని విధంగా తమ రాజకీయ పరపతిని పెంచుకుంటూ తెరాసకి సవాళ్లు విసురుతుంది. ఈ క్రమంలో పురాతన కాంగ్రెస్ పార్టీ తమ ప్రభని క్రమక్రమంగా కోల్పోతుంది. దానిని ఎలాగైనా తిగిరి పొందాలని కాంగ్రెస్ భావిస్తుంది. తెలంగాణలో తెరాస,బీజేపీని తట్టుకోవటం కోసం బలమైన నేతకి పగ్గాలు ఇవ్వాలని చూస్తుంది. అందుకు రేవంత్ రెడ్డి ఒక్కడే సరైనోడిని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.

అయితే రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి రావటం అంత ఈజీ కాదని అర్ధం అవుతుంది. హనుమంతు రావు, పొన్నాల,కోమటిరెడ్డి లాంటి వాళ్ళు పోటీపడున్నారు.అయితే వీళ్ళలో ఎవరికీ కూడా తెరాసని, బీజేపీని ఢీ కొట్టే సత్తా లేదని చాలా మంది భావిస్తున్నారు. కాంగ్రెస్ లో ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఆ సత్తా ఉందని బలంగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సేవలు ఇప్పటికైనా పార్టీకోసం వాడుకుందామని చెపుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఆ పదవి రావటం చాలా కష్టం. ఇవన్నీ దాటుకొని అధ్యక్షుడు అయిన కానీ, సొంత పార్టీలోని అసంతృప్తిని ఎదుర్కొంటు, బయట రెండు బలమైన పార్టీలను ఎదుర్కోవటం అనేది చాలా కష్టమైన పని, అయితే ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ, రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇస్తేనే కాంగ్రెస్ నిలబడే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మరింత అద్వానంగా తయారవుతుంది.