రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిస్తారా?

Saturday, October 19th, 2019, 04:35:22 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బంద్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ బంద్ జరగడానికి గల కారణాలను, కొన్ని ప్రశ్నలను కేసీఆర్ కి సంధించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రెండో దఫా పాలన పడకేసిందని, ఆర్టీసీ సమ్మె జరగడానికి గల కారణం కేసీఆర్ అని ఆరోపించారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని మ్యానిఫెస్టో లో లేదు కరెక్టే, కానీ ఆర్టీసీ ని సగం వరకు ప్రైవేట్ పరం చేస్తామని మ్యానిఫెస్టో లో లేదు కదా, మంత్రులు దీనిపై ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

ఇంధన టాక్స్ గురించి మాట్లాడుతూ, 27 శాతం ఆర్టీసీ ఇంధన టాక్స్, కానీ ఎయిర్ బస్సు కి మాత్రం ఒక్క శాతమే ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ సొమ్ముని ప్రైవేట్ పరం చేయడానికి కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. సెల్ఫ్ డిస్మిస్ పై కూడా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. అసలు ఆ మాటే అనే అధికారం కేసీఆర్ కి లేదని రేవంత్ అన్నారు. మంత్రుల బాధ్యతరహిత మాటల వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాకుండా కేసీఆర్ హైకోర్టు మాటలను పేద చెవిన పెట్టడం పట్ల వ్యాఖ్యలు చేసారు.హైకోర్టు మాటలు పట్టించుకోకపోతే మొట్టికాయలు తప్పవని అన్నారు. ఉద్యమం లో పాల్గొన్న నాయకులెవరు ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడకపోవడం దారుణమని అన్నారు.