హుజూర్‌నగర్‌కి రెడీ అవుతున్న రేవంత్.. టీఆర్ఎస్‌కి ఇక మూడినట్టే..!

Monday, October 14th, 2019, 12:00:37 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డికి ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ, ప్రభుత్వ అవినీతిని తన మాటలతో ఏకీపడేసే సత్తా ఉన్నా నాయకులలో రేవంత్ ముందు వరుసలో ఉంటాడు. అయితే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన క్రేజ్ చూసి ఏకంగా పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే కొడంగల్‌ను తన కంచుకోటగా చెప్పుకునే రేవంత్ ఈ సారి అక్కడ ఓడిపోయినా మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే త్వరలోనే ఈయనకు పీసీసీ పగ్గాలు అందించేందుకు కూడా అధిష్టానం రెడీ అయిపోయింది.

అయితే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆ తరువాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే హుజూర్ నగర్ అభ్యర్ది ఎంపిక విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో విభేదించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చామల కిరణ్ రెడ్డిని తెరమీదకు తీసుకువచ్చారు. అయితే పార్టీలోని సీనీయర్ నేతలంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. అయితే సీనియర్లంతా మద్ధతు తెలపడంతో హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్‌ సతీమణి పద్మావతిరెడ్డినే హైకమాండ్ ప్రకటించింది. అయితే దీనిపై కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉండడంతో అసలు హుజూర్‌నగర్ ప్రచారానికి రేవంత్ వస్తారా లేదా అనేది కార్యకర్తలతో పాటు అభిమానులలో కూడా కాస్త ఆందోళన వైఖరి కనిపించింది.

అయితే ఎట్టకేలకు మనసు మార్చుకున్న రేవంత్ ఈ నెల 18 మరియు 19వ తేదీలలో హుజూర్‌నగర్‌లో రోడ్ షో నిర్వహంచనున్నారు. అయితే ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రేవంత్ ప్రచారం చేపడితే ఆయన మాటల ఇంఫాక్ట్ ఖచ్చితంగా ఉంటుందని అది కాంగ్రెస్‌కు చాలా ప్లస్ అవుతుందనే ఇన్ని రోజులు ఆయన పర్యటనను కాస్త వాయిదా వేసినట్టు అనిపిస్తుంది. అయితే మామూలుగానే అటు కేసీఆర్‌ను, టీఆర్ఎస్ శ్రేణులను ఒక ఆట ఆడుకునే రేవంత్‌కు ఈ సారి ఆర్టీసీ సమ్మెపై కూడా అటు కార్మికులు, ప్రజలు ప్రభుత్వంపై కోపంగా ఉన్న సమయంలో రేవంత్ ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారనేదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఏది ఏమైనా రేవంత్ రంగంలోకి దిగాడంటే టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా మూడినట్టే కనిపిస్తుందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.