రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, సీఎం కేసీఆర్ దోపిడీ ఆపెయ్యాలి – రేవంత్ రెడ్డి…

Saturday, December 14th, 2019, 12:58:30 PM IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నది అధికారంలో ఉన్న కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులే అని చెప్పుకొచ్చారు. కాగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, దేశంలో అధికమవుతున్న రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేయడానికి ‘భారత్‌ బచావ్‌’ ర్యాలీ ని ప్రారంభిస్తున్నామని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా దేశంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, శాంతి భద్రతలకు విలువ లేకుండా పోయిందని, మహిళలకు రక్షణ లేదని రేవంత్ రెడ్డి తీవ్రగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్ పాలన కోసం మాట్లాడుతూ… “కేసీఆర్‌ దోపిడీ ఆపేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురు శ్రీమంతులయ్యారు. రాష్ట్రం మాత్రం దివాలా తీసింది” అని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా తన కుటుంబ పాలనను పక్కన బెట్టి రాష్ట్ర ప్రజలందరికోసం ఆలోచించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.