బంగారు తెలంగాణ కాదు బాకీల తెలంగాణ: రేవంత్ రెడ్డి

Friday, December 13th, 2019, 02:49:01 AM IST

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నేడు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై మండిపడ్డారు. వరుసగా రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఅర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని మరిచిందని అన్నారు.

అయితే రాష్ట్రాన్ని కాంగ్రెస్ మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే కేసీఆర్ ఆరేళ్ళలో అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. 16 వేల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి బాకీల తెలంగాణగా మార్చారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూడా కేసీఆర్ నెరవేర్చలేకపోయారని అన్నారు.