కాంగ్రెస్ నేతల పై అదిరిపోయే పంచులు వేసిన రేవంత్ రెడ్డి

Wednesday, September 18th, 2019, 08:06:33 PM IST

అసెంబ్లీ సమావేశాలకు హరవ్వడం పట్ల, కాంగ్రెస్ నేతల తీరు పట్ల పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి మంత్రి రేవంత్ రెడ్డి. శాసన సభ సమావేశాలు 14 రోజులకి తక్కువగా జరగకూడదని, ఇది విరుద్ధమని అన్నారు. అసెంబ్లీ రూల్స్ బుక్ లోనే ఏ నిబంధన ఉందంటూ అక్కడ వున్నా పలువురి నేతలకు తెలియ చేసారు. విద్యుత్ అంశం పై చర్చించే టపుడు అక్కడి కాంగ్రెస్ నేతలు లేచి వెళ్లిపోవడం పట్ల తీవ్ర అభ్యన్తరం తెలిపారు. ఈ విషయాన్నీ అడిగేందుకే అసెంబ్లీకి వచ్చా అంటూ వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో విభేదాలు చోటు చేసుకున్న విషయం వాస్తవం. గవర్నర్ ని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు కలిసి వెళ్లారని, ఆ విషయం నాకు చెప్పలేదని అన్నారు. పార్టీ కి సంబందించిన పలు అంశాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీ లో ఎపుడు పదవులు వస్తాయో.. ఎపుడు పోతాయో తెలీదంటూ వ్యాఖ్యలు చేసారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పై అధిష్టానం ఇంకా నిర్ణయహం తీసుకోలేదని, శ్యామల కిరణ్ రెడ్డి ని ఆ స్థానానికి గాను, తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. యురేనియం పై తమ పార్టీ నేత అయినా సంపత్ కుమార్ కి ఏబీసీడీ లు కూడా తెలియదు అంటూ ఎద్దేవా చేసారు. ఏదేమైనా రేవంత్ తీరుతో తెలంగాణాలో కాంగ్రెస్ ఉనికిని చాటుకున్న, వారిలోని విభేదాలు తెరాస పార్టీ కి బలం అని విశ్లేషకులు భావిస్తున్నారు.