సీఎం కేసీఆర్‌ని నిలదీసిన రేవంత్ రెడ్డి.. బహిరంగ లేఖతో డిమాండ్..!

Wednesday, February 12th, 2020, 05:19:48 PM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏవైనా ఎన్నికలు ఉంటేనే కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, రైతు బంధు పథకాన్ని ఎన్నికల పథకంగా మార్చేశారని అన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని అన్నారు.

అయితే కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన సీఎం కేసీఆర్ కనీసం రైతుల సమస్యలపై ఐదు నిమిషాలు కూడా చర్చించలేదని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కూడా ఇంకా రైతు రుణమాఫి అమలు చేయలేదని అన్నారు. అయితే నేడు సీఎం కేసీఅర్‌కి బహిరంగ లేఖ పంపిన రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.