నల్లమల్ల ఫారెస్ట్ లో రేవంత్ రెడ్డి సింహగర్జన…కేసీఆర్ వెన్నులో వణుకు

Friday, August 23rd, 2019, 11:16:12 AM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, దేశ మొత్తం తెలంగాణ వైపు చూసేలా మరి కొద్దీ రోజుల్లో ఒక ఉద్యమం మొదలుకాబోతుందా..? అంటే కొంచం అనుమానంగానైనా అవును అనే చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలోని నల్లమల్ల ఫారెస్ట్ లో యురేనియం తవ్వటానికి కేంద్రం అనుమతి ఇవ్వటం, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అడ్డు చెప్పకుండా ఆమోదముద్ర వేయటం జరిగింది. దీనితో నల్లమల్ల అడవుల నుండి విచ్చలవిడిగా యురేనియం తవ్వకాలు జరగబోతున్నాయి

ఇదే కనుక జరిగితే కొన్ని వేలమంది అడవి బిడ్డలు జీవితాలు దారుణంగా ప్రభావితం అవుతాయి. అదే విధంగా అనేక జంతు జాతులు ప్రమాదంలో పడే అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని వేల గిరిజన కుటుంబాలు రోడ్డున పడటం ఖాయం. ఇవన్నీ తెలిసిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని మార్చుకోవటం లేదు. దీనితో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాడు. ఇప్పటికే నల్లమల్ల ఫారెస్ట్ లోని గిరిజనలతో రేవంత్ రెడ్డి మాట్లాడి వాళ్లలో చైతన్యం పెరిగేలా చేస్తున్నాడు.

యురేనియం తవ్వకాలు వలన కలిసే సమస్యల గురించి వాళ్ళకి వివరించి దానిని అడ్డుకునే విధంగా వాళ్లలో ధైర్యాన్ని నింపుతున్నాడు. గత వారం రోజుల నుండి రేవంత్ రెడ్డి కాన్వాయ్ నల్లమల్ల ఫారెస్ట్ తిరుగుతూ అక్కడ ఒక మహా ఉద్యమాన్నే లేవతీసే విధంగా రూపకల్పన చేస్తుంది. అదే కనుక జరిగితే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఇక నూకలు చెల్లినట్లే, ఈ ఉద్యమం వలన రేవంత్ రెడ్డి సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ సమస్యకి ఉన్న తీవ్రత అలాంటిది. అందుకే రేవంత్ రెడ్డి దాని బాధ్యతని భుజానికెత్తుకున్నాడు.