తెరాసని దెబ్బకొట్టటానికి రేవంత్ రెడ్డి చేతికి దొరికన అస్త్రం అదే..ఇక దబిడి దిబిడే

Monday, August 19th, 2019, 04:39:15 PM IST

తెలంగాణలో సీఎం కేసీఆర్ పై ఎలాంటి భయం,బెరుకు లేకుండా ఒంటి కాలుమీద లేచే నాయకుడు రేవంత్ రెడ్డి. ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చిన సరే దానితో అధికారపార్టీని ముప్పతిప్పలు పెట్టే సత్తా కలిగిన నేత రేవంత్ రెడ్డి. అలాంటి ఆయనని ఇప్పడు ఇటు తెరాసని, అటు బీజేపీని ఒకే సారి ఇరుగున పెట్టే అస్త్రం ఒకటి దొరికింది అదే “యురేనియం” దాన్నితవ్వి తీయటం వలన రెండు మండలాల్లోని సుమారు అరవై వేలమంది రోడ్డున పడతారని రేవంత్ ..అరుదైన చెంచు జాతి అంతరించే ప్రమాదం ఉందని .అతిపెద్ద టైగర్ జోన్ ప్రాంతంగా నల్లమలో తవ్వకాలు జరిపితే పులులు అంతరించే ప్రమాదం సైతం ఉందని హెచ్చరిస్తూ ఉద్యమం ప్రారంభించారు.

యురేనియం తవ్వి తీయాలని చూస్తే గునపం దిగేది భూమిలో కాదు, మీ గుండెల్లో దించుతా అంటూ తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికే చాలా మంది మేధావులు, నిపుణులు కూడా ఈ తవ్వకాల వలన అపారమైన నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి దీనిపై ఉద్యమిస్తూ మాట్లాడటంతో ప్రభుత్వాలు ఇరుగున పడే పరిస్థితి వచ్చింది. ఈ దెబ్బతో ఒకేసారి కేంద్రం ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయవచ్చు. దీనిపై ఉద్యమించడానికి కాంగ్రెస్ అనుమతి కూడా ఇచ్చింది. కాబట్టి దీనిని ఎంత వరకు రేవంత్ రెడ్డి తీసుకోని వెళ్తే రాజకీయంగా అంత మంచిది .