ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రేవంత్..కన్నీళ్లు తెప్పించే ఘటన

Wednesday, September 18th, 2019, 07:35:25 AM IST

తెలాంగాణ టీడీపీ అంటే వెంటనే గుర్తువచ్చే పేరు రేవంత్ రెడ్డి. టీడీపీ అంటే రేవంత్ రెడ్డి అనేలా ఆయన హావ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత టీడీపీకి పెద్ద దిక్కుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎంత మంది టీడీపీని వదిలి వెళ్లిన కానీ తన పోరాటం మాత్రం ఆపకుండా కొనసాగించాడు. కానీ ఒక్కడే ఎంత దూరమని వెళ్లగలడు. కొన్ని అనివార్య కారణాల వలన రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి, అసెంబ్లీ నుండి పోటీచేసి ఓడిపోయి, తిరిగి పార్లమెంట్ కి పోటీచేసి ఎంపీ అయ్యాడు.

తనకి రాజకీయ ప్రస్థానానికి మూలకారణమైన టీడీపీ అంటే రేవంత్ రెడ్డికి అభిమానం ఉంది. అయితే తాను టీడీపీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి టీడీపీ కార్యకర్తలకి తనపై కోపం ఉంటుందని రేవంత్ రెడ్డి అనుకోని ఉంటాడు అది సహజమే. అయితే నిన్న జరిగిన ఒక సంఘటన చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి అంటే టీడీపీ వాళ్ళకి ఎంత అభిమానం అనే విషయం తెలుస్తుంది. కోడెల శివప్రసాద్ చనిపోయిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంచారు. దానికి చూడటానికి రేవంత్ రెడ్డి ట్రస్ట్ భవన్ రావటం జరిగింది.

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి అక్కడికి వెళ్తున్నాడు. అక్కడి కార్యకర్తలు ఎలా స్పందిస్తారో అనే అనుమానం కూడా ఉంటుంది కానీ. రేవంత్ రెడ్డి వాటిని పట్టించుకోకుండా వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రేవంత్ రెడ్డిని చూసిన టీడీపీ అభిమానులు “అన్న ఎలా ఉన్నావు ” అంటూ ఆప్యాయంగా చుట్టూ ముట్టరు. ఆలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని తమ అభిమానంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ ఘటన చూసి రేవంత్ రెడ్డి కూడా చలించిపోయాడు. అక్కడ నుండి అంత అభిమానం తనకి వస్తుందని అనుకోలేదు. ఇక ఆ సంఘటన టీవీలో చూస్తున్న టీడీపీ వాళ్ళు కూడా కదిలిపోయారంటే అర్ధం చేసుకోండి ఎమోషనల్ గా అది ఏ స్థాయిలో ఉంది. అలాంటి అభిమానం డబ్బులు పెడితే రాదు..గుండె లోతుల్లో నుండి రావాలి…