బిగ్ బ్రేకింగ్: ఈ విషయం తెలిశాక ఎవరైనా రేవంత్ రెడ్డి ఫ్యాన్ అవ్వాల్సిందే!

Monday, October 21st, 2019, 04:17:32 PM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె పై కాంగ్రెస్ నేతలు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు పోరాడుతూనే వున్నారు. వారి పోరాటం సరియైనది అని భావించి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 21 న ప్రగతి భవన్ ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను నిన్ననే ప్రకటించింది. కాగా ఈ విషయంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసి కాంగ్రెస్ నేతలని బయటికి రానివ్వకుండా తెరాస ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

అయితే ఒక పక్క హుజుర్ నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో రాష్ట్రం లో సర్వత్రా ఇదే విషయమై చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి చాకచక్యం గా తప్పించుకొని ప్రగతి భవన్ ని టచ్ చెయ్యడమే కాకుండా, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ నినాదాలు పలికారు. తాను చేయవల్సిన పనిని ఎట్టి పరిస్థితులలోను ఎలాగైనా చేస్తున్న రేవంత్ రెడ్డి పై తన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి పోరాటం ముందు అంటా దిగ దుడుపే.