యావత్ తెలంగాణ చూపు హుజుర్ నగర్ వైపే ఉంది – రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

Friday, October 18th, 2019, 09:11:16 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని హుజుర్ నగర్ నియోజకవర్గంలో మరికొద్ది రోజుల్లో ఉపఎన్నిక జరగనున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీ మాత్రం అదికార తెరాస మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యన ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. కాగా ఈ హుజుర్ నగర్ ఉప ఎన్నికని తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు ఆత్మగౌరవంగా పరిగణించుకున్నాయి. ఎలాగైనా సరే ఈ ఉపపోరు లో తమ జెండా ని ఎగరేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయితే నేడు హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి తరపున ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాడు. కాగా ఈ ప్రచారంలో భాగంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రికేసీ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.

హుజుర్ నగర్ ప్రాంత అంత కూడా ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన అవసరాలను అన్నింటిని కూడా ఉత్తమ్ కోట్లాది తెప్పిస్తున్నారని రేవంత్ రెడ్డి వాఖ్యానించారు. ఇకపోతే తెరాస అధినేత కెసిఆర్ ప్రజలందరినీ అవసరానికోసం బాగా వాడుకొని, ఆ తరువాత చుక్కలు చూపిస్తారని, ఈమేరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నిదర్శనం అని అన్నారు. అయితే సీఎం కెసిఆర్ ఇక్కడ నిర్వహించాల్సిన సభ వర్షం కారణంగా రద్దు చేసుకున్నారనే వార్త అబద్దం అని, ఒకవేళ ఇక్కడ సభ నిర్వహిస్తే ఆర్టీసీ కార్మికులు బుద్ది చెబుతారనే కారణంతో ఇలా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా రాష్ట్రంలోని అందరు కూడా కాంగ్రెస్ కి మద్దతిస్తున్నారని, ఈసారి కూడా ఇక్కడ ఎగిరేది కాంగ్రెస్ జెండా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.