ఉత్తమ్ తో వ్యతిరేకేత్తిస్తున్న రేవంత్ రెడ్డి – కారణం ఏంటి…?

Thursday, September 19th, 2019, 12:42:38 AM IST

తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రగడ జరుగుతుందని చెబుతున్నారు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు. అయితే తెలంగాణలోని హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక జరుగుతున్నదన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పేరుని ప్రకటించడం పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంది, అధిష్టానాన్ని సంప్రదించకుండా, ఎవరికీ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా తన భార్య పేరును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎలా నిర్ణయిస్తారని రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బుధవారం నాడు గోల్కొండ హోటల్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ చేసిన పనిపై ప్రశ్నించారు. అంతేగాకుండా ఉత్తమ్‌కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని, పార్టీ అంటే తన ఇంటికే పరిమితం కాదు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఈ విషయాన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కుంతియా తెలిపారు.