చరణ్ రంగస్థలంపై .. పుస్తకమా ?

Thursday, May 10th, 2018, 10:27:28 AM IST

ఈ మధ్య సినిమాలు చేసే ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది. కొత్తదనం ఉన్న ఏ సినిమానైనా ఆదరిస్తున్నారు. అది కొత్త నేపథ్యం కావొచ్చు .. లేదా మన పాతతరం నేపథ్యం కావొచ్చు. ఈ మధ్య టాలీవుడ్ లో వెనకటి కాలానికి వెళ్లి సినిమాలు తీసే పరంపర ఎక్కువైంది. దీనికి ముఖ్యకారణం రంగస్థలం. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా 200 కోట్ల వసూళ్లు రాబట్టి దుమ్ము రేపింది. మట్టి నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఆదరణ పెరిగింది.. ఎందుకంటే మనం వచ్చింది ఆ మట్టిలోనుండే కదా !! ఇక నాన్ బాహుబలి రికార్డుగా సంచలన విజయాన్ని అందుకున్న రంగస్థలం సినిమా పై ఓ పుస్తకం రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయట. ఓ సీనియర్ జర్నలిస్ట్ ఈ తరహా ప్రయత్నం చేస్తున్నాడట. రంగస్థలం సినిమా మేకింగ్ .. అందులోని కథను టచ్ చేస్తూ ఈ పుస్తకాన్ని రాస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే బాహుబలి సినిమాలో శివగామి పాత్ర పేరుతొ ఓ పుస్తకం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రంగస్థలం పై పుస్తకం అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది.

Comments