రివ్యూ రాజా తీన్‌మార్ : కిర్రాక్ పార్టీ – కేవలం యువతకే !

Friday, March 16th, 2018, 05:00:03 PM IST

తెరపై కనిపించిన వారు : నిఖిల్ సిద్దార్థ, సిమ్రన్ పరీన్జ, సంయుక్త హెగ్డే
కెప్టెన్ ఆఫ్ ‘కిర్రాక్ పార్టీ ‘ : శరన్ కొప్పిశెట్టి

మూల కథ :

స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే ఇంజనీరింగ్ స్టూడెంట్ కృష్ణ (నిఖిల్) మొదటి సంవత్సరంలోనే తనకు నాలుగు సంవత్సరాల సీనియర్ అయిన మీర (సిమ్రన్ పరీన్జ) ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని పేమిస్తుంది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల అతనికి మీర దూరమవుతుంది. ఆమె దూరం అవడంతో జీవితంలో ప్రేమను కోల్పోయిన కృష్ణ కఠినంగా మారి, ఎలక్షన్స్ అంటూ ఎప్పుడూ గొడవలతో కలం గడుపుతుంటాడు. అయితే అదే కాలేజీలో చదువుతున్న సత్య (సంయుక్త హెగ్డే) అనే జూనియర్ అతన్ని ప్రేమిస్తుంది. కానీ కృష్ణ మాత్రం మీర జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు. అసలు మీర కృష్ణకు ఎలా దూరమైంది, ఆ భాదతో కృష్ణ ఎలా తయారయ్యాడు, మరి సత్య ప్రేమని కృష్ణ ఒప్పుకుంటాడా లేదా అనేదే సినిమా కథ…

విజిల్ పోడు :

హీరో నిఖిల్, కృష్ణ పాత్రలో బాగానే నటించాడు. మొదటి సంవత్సరం చదివే కుర్రాడిగా సరదగా, ఎనర్జిటిక్ గా కనిపిస్తూనే కాలేజ్ సీనియర్ గా రఫ్ అండ్ టఫ్ లుక్లో అదరకొట్టాడు. కాబట్టి మొదటి విజిల్ నిఖిల్ కు వేయాలి.

సంగీత దర్శకుడు అంజనీష్ లోకనాథ్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ ఇంప్రెస్ చేశాయి. కాబట్టి రెండో విజిల్ అంజనీష్ కి వేయాలి.

సుధీర్ వర్మ రాసిన ఫస్టాఫ్ స్కీన్ ప్లే బాగుంది. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్, హీరో ఆకట్టుకోగా సినిమా యొక్క కాలేజ్ నైపథ్యం యువతకు తమ కాలేజీ రోజుల్ని తప్పక గుర్తు చేస్తుంది. కాబట్టి మూడో విజిల్ సుధీర్ వర్మ కు వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

సినిమాకు ప్రధాన మైనస్ చెప్పుకోడానికి బాగేనా ఉండే స్టోరీ లైన్ ను ఒక సినిమాకు కావాల్సిన పూర్తిస్థాయి మెటీరియల్ అందించే విధంగా తయారుచేయలేకపోవడమే.

ఇంటర్వెల్ సమయానికి బలంగా బయటపడే కథను దర్శకుడు శరన్ కొప్పిశెట్టి సెకండాఫ్ మొత్తం అంతే బలంగా నడపడంలో పెద్దగా సక్సెస్ కాలేదు.

విరామ సమయానికి అసలు కథ ఓపెన్ అయినా ద్వితీయార్థంలో అదెక్కడా పెద్దగా కనిపించదు. కాలేజ్ ఎలక్షన్స్, గొడవలు అంటూ సినిమా సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. పోనీ ఆ అంశాలనైనా ఎఫెక్టివ్ గా చూపించారా అంటే పేలవమైన సన్నివేశాలతో అరకొరగా చూపించి వదిలేశారు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

సినిమాలో మూల కథ, కథనాన్ని సెకండాఫ్ లో పక్కదారి పట్టించడం.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా చూస్తుంటే నాకేమి గుర్తుకు వచ్చాయో తెలుసా?

మిస్టర్ బి : ఏమి గుర్తుకువచ్చాయిరా?

మిస్టర్ ఏ : నా కాలేజీ రోజులు

మిస్టర్ బి : అవును నాక్కూడా

మిస్టర్ ఏ : మొత్తానికి సినిమా ఎలావుందంటావ్?

మిస్టర్ బి : యువతకు మాత్రమే నెహే!