రివ్యూ రాజా తీన్‌మార్ : ఆచారి అమెరికా యాత్ర – ఏమాత్రం పస లేని యాత్ర

Friday, April 27th, 2018, 05:18:03 PM IST

 

తెరపై కనిపించిన వారు : మంచు విష్ణు, ప్రగ్య జైస్వాల్
కెప్టెన్ ఆఫ్ ‘ఆచారి అమెరికా యాత్ర’ : జి.నాగేశ్వర్ రెడ్డి

మూల కథ :

ఒక ఫామిలీ ఫంక్షన్ నిమిత్తం ఇండియాకు వచ్చిన రేణుక (ప్రగ్య జైస్వాల్)ను, ఆ ఇంట్లో హోమం జరిపించడం కోసం వచ్చిన కృష్ణమాచారి (మంచు విష్ణు) తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ తరువాత ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. వారిప్రేమను ఒకరికొకరు వ్యక్తపరుచుకునే సమయానికి వున్నట్లుండి రేణుక అమెరికా తిరిగి వెళ్ళిపోతుంది. ఆమె కోసం కృష్ణమాచారి తన గురువు అప్పలాచారి(బ్రహ్మానందం)సహా మరికొందరు బ్రాహ్మణులను మాయాతాలు చెప్పి అమెరికా తీసుకువెళతాడు. అక్కడ ఆమె ప్రేమను దక్కించుకోవడానికి ఏమి చేసాడు. అతడి వల్ల అప్పలాచారి, ఇతరులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, అసలు కృష్ణమాచారి, రేణుకల ప్రేమకు అడ్డుపడింది ఎవరు అనేది అసలు కథ.

విజిల్ పోడు :

→ సినిమాకి ప్రధానబలం హీరో విష్ణు, బ్రహ్మానందంల కామెడీ ట్రాక్ అని చెప్పుకోవాలి. పెళ్లికాని పురోహితుడుగా, అలానే శిష్యుడు కృష్ణమాచారి చేసేపనులు ఇరుక్కుపోయి నానా అవస్థలుపడే గురువు అప్పలాచారి పాత్రలో బ్రహ్మానందం మంచి నవ్వులు పూయించారు.

→ హీరో విష్ణు కూడా మరొక సారి తనలోని కామెడీ యాంగిల్ ను బాగా ఉపయోగించాడు. కథలో ముఖ్యంగా తాతా మానవరాళ్ల సెంటిమెంట్ కొంతవరకు బానే ఎలివేట్ అయిందని చెప్పుకోవాలి.

→ తాత పాత్రలో కోట శ్రీనివాసరావు నటన బాగుంది. విలన్ గా చేసిన ప్రదీప్ రావత్ నటన పర్వాలేదనిపిస్తుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

→ దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఆయన గాథాచిత్రాల వాలే ఈ చిత్రాన్ని అంత కామెడీగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని చెప్పుకోవాలి.

→ చాలా సింపుల్ కథను రాసుకున్న ఆయన పూర్తి స్థాయిలో బ్రహ్మానందం, పృథ్వి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను లను వినియోగించుకోలేకపోయాడు అని చెప్పుకోవాలి. కాస్త బ్రహ్మానందం మినహాయించి మిగిలిన వారంతా చాలా చోట్ల వృధాగానే కనిపించారు.

→ చాలా నార్మల్ గా మోదయ్యే ఈ చిత్రం మొత్తం మీద ఒకరి రెండు చోట్ల తప్ప మరెక్కడా ఆసక్తిరకరంగా అనిపించలేదు. పైగా కొన్ని సన్నివేశాలను కావాలని ఇరికించినట్లు అనిపించింది.

→ ఠాగూర్ అనూప్ సింగ్ వంటి ప్రతినాయకుణ్ణి కూడా దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక దర్శకుడు చిత్రాన్ని చాలా చప్పగాతెరకెక్కించాడు.

→ మొత్తం మీద సినిమా చూస్తుంటే ఎటువంటి హోమ్ వర్క్ లేకుండా కథను తాయారు చేసుకున్నారా అనిపించక మానదు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

పక్కా రొటీన్ కథ, కథనాలతో ప్రేక్షకులని బోర్ కొట్టించడం

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా ఎలా అనిపించింది రా

మిస్టర్ బి : చెప్పలేనురా

మిస్టర్ ఏ : అదేంటిరా యాత్ర ఎలా సాగింది

మిస్టర్ బి : ఏ మాత్రం పస లేకుండా చాలా చప్పగా సాగిందిరా

 

  •  
  •  
  •  
  •  

Comments