రివ్యూ రాజా తీన్‌మార్ : కణం – కొంచెం ఎమోషన్ ఉంది

Friday, April 27th, 2018, 05:20:27 PM IST

 

 

తెరపై కనిపించిన వారు : నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా అరోరా
కెప్టెన్ ఆఫ్ ‘ కణం’ : ఏ.ఎల్.విజయ్

మూల కథ :
తులసి (సాయి పల్లవి), కృష్ణ (నాగ శార్య)లు 19 ఏళ్ల వయసులోనే తొందరపడతారు. ఆ తొందరపాటుతో తులసి గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన పెద్దలు బలవంతంగా తులసి కడుపులోని బిడ్డను అబార్షన్ ద్వారా చంపేస్తారు.

కడుపులోనే మరణించి తల్లికి దూరమైన బిడ్డ ఆత్మగా మారి తన చావుకి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ బిడ్డ ఆత్మ ఎవరెవరిపై, ఎలా కక్ష సాధించింది అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :
→ ఈ సినిమా ద్వారా దర్శకుడు విజయ్ గర్భస్రావం ద్వారా ప్రపంచాన్ని చూడని బిడ్డల్ని చంపడం ఎంత అనైతికమో వివరించారు. కనుక మొదటి విజిల్ ఆయనకే వేయాలి.

→ చనిపోయిన బిడ్డ ఆత్మగా మారి తల్లి చుట్టూ తిరగడం, తన చావుకి కారణమైన వారిని చంపడం, చివరికి తండ్రిని కూడ వదలకపోవడం, భర్తను కాపాడుకోవడానికి హీరోయిన్ చేసే ప్రయత్నం బాగున్నాయి. వీటికి రెండో విజిల్ వేసుకోవచ్చు.
→ ఇక తక్కువ రన్ టైం కలిగిన సెకండాఫ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఊహించని విధంగా ఉన్న కక్లైమాక్స్, సాయి పల్లవి పెర్ఫార్మెనన్స్, కథలోని తల్లి, కూతుళ్ళ మధ్యన బంధం వంటి అంశాలను మూడో విజిల్ వేయవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

→ సినిమా కథ వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద చూపడాని సరిపడినంత కథనాన్ని విజయ్ తయారుచేసుకోలేదు.

→ క్లైమాక్స్ మినహా సినిమాలో కథనం మొత్తాన్ని ముందుగానే మనం ఊహించేయవచ్చు. పైగా కథనంలో బలవంతంగా జొప్పించి ప్రియదర్శి పోలీస్ పాత్ర కొంత చికాకు పెట్టింది.

→ ఇక సినిమాలో ఎక్కడా కామెడీ, యాక్షన్, రొమాన్స్ వంటి కమర్షియల్ అంశాలే కనబడవు. ఇది రెగ్యులర్ కమర్షియల్ ప్రేక్షకులకు నిరుత్సాహాన్ని కలిగించే విషయమే.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

ఈ సినిమాలో పెద్దగా వింతగా తోచే అంశాలేవీ కనబడలేదు.

సినిమా చూసిన స్నేహితుడికి, సినిమా చూడని స్నేహితుడికి మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : ‘కణం’ ఎలా ఉందిరా ?
మిస్టర్ బి : పర్లేదు. కొంచెం ఎమోషన్ ఉంది
మిస్టర్ ఎ : హర్రర్ థ్రిల్లర్ అన్నారు కదా !
మిస్టర్ బి : భయపెట్టలేదు కానీ కొద్దిగా థ్రిల్ చేసింది.
మిస్టర్ ఎ : మరి సాయి పల్లవి ?
మిస్టర్ బి : ప్రత్యేకంగా చెప్పాలా.. బాగానే చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments