రివ్యూ రాజా తీన్‌మార్ : “ఎమ్యెల్యే ” మామూలు లక్షణాలున్న ఎంటెర్టైనెర్

Saturday, March 24th, 2018, 01:45:49 AM IST

తెరపై కనిపించిన వారు : కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్
కెప్టెన్ ఆఫ్ ‘ఎమ్యెల్యే ‘ : ఉపేంద్ర మాధవ్

మూల కథ :

కొన్ని అనుకోని కారణాల వల్ల ఇందు (కాజల్) ఇంట్లోనుండి బయటికి వచ్చి ఒక కంపెనీకి ఎం.డి అవుతుంది. అక్కడ కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) ఇందును చూసి ప్రేమిస్తాడు. కొంతకాలం తరువాత ఇద్దరు ఇష్టపడతారు. ఒక సందర్భంలో ఇందు తల్లితండ్రులు ఇందుతో పెళ్లి జరగాలంటే ఎం.ఎల్. ఏ అవ్వాలని కళ్యాణ్ కు షరతు పెడతారు. అసలు ఇందు తల్లిదండ్రులు కళ్యాణ్ కు ఎం.ఎల్.ఏ అవ్వాలనే కండిషన్ ఎందుకు పెట్టారు ? ఎం.ఎల్.ఏ అవ్వడానికి కళ్యాణ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేదే ఈ సినిమా.

విజిల్ పోడు :

కథానాయకుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. నటుడిగా అయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫిట్ గా కనిపిస్తూ సరికొత్త లుక్స్ తో ఆకట్టుకున్నారు

కాజల్ అందం, అభినయం బాగున్నాయి. ద్వితీయార్థంలో పల్లెటూరు అమ్మాయిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి మెప్పించింది.

బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్విల కామెడి పరువాలేదు. మంచి లొకేషన్లలో చిత్రీకరించిన మోస్ట్ వాంటెడ్ అబ్బాయి పాట బాగుంది.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రాసుకున్న ఈ లైన్ బాగున్నా దాన్ని తెరమీద ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరుకు విఫలమయ్యాడని చెప్పాలి.

న్ని సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు, స్క్రీన్ ప్లే రెగ్యులర్ గా ఉంది. అందుచేత సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథకు పెద్దగా కనెక్ట్ కాలేడు.

ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నా, అప్పుడే సినిమాలోని అసలు కథ మొదలైనా తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుల్లకు సులభంగా తెలిసిపోతుంటుంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని కోరుకునే వారికి మాత్రమే ఈ చిత్రం బాగా నచ్చుతుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..
మిస్టర్ ఎ : మంచి కమర్షియల్ సినిమా కదా!
మిస్టర్ బి : అవును ఇంకొంచెం కొత్తదనం ఉంటే బాగుండేది.
మిస్టర్ ఎ : చివరిగా, ఈ సినిమా చూడొచ్చంటావా
మిస్టర్ బి : ఆ! బానే వుంది, బాగున్నాడు మన ఎమ్యెల్యే