లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాపై వర్మ మరో క్లారిటీ

Tuesday, September 26th, 2017, 06:05:01 PM IST


గత కొన్ని రోజులుగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే విషయంపై రోజుకో వార్త సంచలనంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు వర్మ నిర్ణయానికి ఫైర్ అయ్యారు. మీడియా ద్వారా వార్నింగ్ లు కూడా ఇచ్చారు. దీంతో వర్మ కూడా ఎప్పుడు చెప్పని విధంగా గట్టిగానే కౌంటర్ వేశారు. ఎవ్వరు ఏమనుకున్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ కథను తెరకెక్కిస్తానని గట్టిగా చెబుతున్నాడు.

అయితే రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన ఒక న్యూస్ హల్ చేస్తోంది. ఆ సినిమాను నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి నిర్మిస్తున్నాడని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై వర్మ తన ఫెస్ బుక్ అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమాను జేడీ చక్రవర్తి నిర్మించబోతున్నడని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని తేల్చి చెప్పేశారు. దీంతో రూమర్ కి ఎండ్ కార్డ్ పడింది.

  •  
  •  
  •  
  •  

Comments