రోజా పక్కన వుంది దిష్టిబొమ్మ అంటున్న రామ్ గోపాల్ వర్మ!

Thursday, January 23rd, 2020, 11:08:00 AM IST

సోషల్ మీడియా లో రోజా, బాలయ్య బాబుతో దిగిన సెల్ఫీ విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో ఫై ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేస్తున్నారు. వీరిద్దరూ చాల సినిమాల్లో కలిసి హీరో హీరోయిన్లు గా నటించారు. కానీ ప్రస్తుతం ఒకరు అధికార పార్టీలో మరొకరు ప్రతిపక్ష పార్టీలో వున్నారు. అయితే వీరిద్దరూ సరదాగా దిగిన ఫోటో ఫై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ని హీరో లా వున్నారు అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేసారు.

బాలయ్య రోజా పక్కనో చూడటానికి అసహ్యంగా వున్నాడని, ఆ ఫ్రేమ్ లో రోజా అందాన్ని పాడు చేసారని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంతటితో ఆగకుండా, రోజాకు బాలయ్య బాబు దిష్టి బొమ్మ కావచ్చు అని ట్వీట్ చేసాడు. అయితే ఆ ఫొటోలో పైన కనిపిస్తున్న మరొక వ్యక్తి ని ఆర్జీవీ దిష్టి బొమ్మ అన్నాడు అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుల ఫై నిన్న చర్చలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.