ఏందీ బాసూ … వర్మ ఫోకస్ మారింది ?

Friday, January 20th, 2017, 11:03:06 AM IST

RGV
మొత్తానికి ఎనిమిదేళ్ల రాజకీయాల అనంతరం రీ ఎంట్రీ తో తన సత్తా చాటుకున్నాడు మెగాస్టార్? ఇంకా తన స్టామినా తగ్గలేదని, నేటి యువ హీరోలకు పోటీగా చిరంజీవి ఉన్నాడని అంటున్నారు జనాలు. ఖైదీ నంబర్ 150 వ సినిమా అప్పుడే వందకోట్ల మార్కెట్ ను కొల్లగొట్టింది. ఇక సంచలన దర్శకుడు వర్మ .. ఎప్పుడు మెగాస్టార్, మెగా ఫ్యామిలీ పై కామెంట్స్ చేస్తూ నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా నాగబాబు కామెంట్స్ తో ఈ వ్యవహారం ఇంకాస్త ఎక్కువైంది. ఇక ఆ విషయం పక్కన పెడితే .. లేటెస్ట్ గా వర్మ ట్విట్టర్ లో మెగాస్టార్ ను పొగుడుతూ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఎప్పుడు చిరంజీవి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తుండే వర్మ .. ఒక్క సారిగా ఇలా మారిపోయాడేంటి అంటూ అందరు షాక్ అవుతున్నారు. ఇంతకి వర్మ ఏమని కామెంట్స్ పెట్టాడో తెలుసా .. ”ఇప్పుడే 150 సినిమా చూసా .. మెగా మెగా మెగా ఫెంటాస్టిక్ కంటే మెగాస్టార్ చాలా అద్భుతంగా ఉన్నారు. 150 మిలియన్ల చీర్స్ చెబుతున్నా .. ఎనర్జీ లెవెల్స్ లో మెగాస్టార్ సుప్రీం అంతే . 9 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ ని వదిలేసి వెళ్ళినప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు, మెగా హ్యాండ్సమ్ గా అయన కనిపిస్తున్నారు” అంటూ పాజిటివ్ గా కామెంట్స్ పెట్టారు. ఇంత సడన్ గా వర్మలో వచ్చిన మార్పేమిటో మరి !!