మరొకసారి రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్లు

Wednesday, December 28th, 2016, 05:03:38 PM IST

RGV
ఎప్పుడూ ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలవడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు కొత్తేమీకాదు. రాజకీయ నాయకుల పైనో, లేదంటే సినీ ప్రముఖులు మీదో ఏదొక కామెంట్స్ చేస్తూ ఉంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇలాంటి వాళ్ళ అందరి మీద కామెంట్స్ చేస్తూ తనకు తానుగా పబ్లిసిటీ పెంచుకుంటూ ఉంటాడు.

తాజాగా ఆయన అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ చూసారు. అందులో నటించిన అమీర్ ఖాన్ ను రాంగోపాల్ వర్మ పొగడ్తలతో ముంచెత్తాడు. మిగిలిన ”ఖాన్” హీరోలపై మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇతర ఖాన్ ల కారణంగా ప్రపంచం అంతా భారతీయులందరినీ పిచ్చివాళ్ల లా చూస్తుందని, అయితే అమీర్ ఖాన్ వల్లే ప్రపంచం అంతా భారతదేశాన్ని సీరియస్ గా తీసుకుంటుందని ఆయన అన్నారు. తాను చాలా రోజుల నుండి చూస్తున్నానని, ఏ హీరో అయినా తండ్రిగా కనిపించడానికి బరువు పెరిగి లావుగా కనబడ్డారా..? అని ప్రశ్నించారు. మిగిలిన స్టార్ హీరోలు 50 ఏళ్ల తరువాత కూడా సిక్స్ ప్యాక్ లు చేస్తూ ప్రేక్షకులను వెర్రి వాళ్ళను చేస్తుంటే అమీర్ ఖాన్ మాత్రం ప్రజల ఆలోచనలను నమ్ముతున్నాడు. అందుకే అమీర్ పాదాలను తాకాలని ఉందని వర్మ అన్నారు. తనకు దంగల్ సినిమా చుసిన తరువాత మిగిలిన స్టార్ హీరోలు అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తమను తామే తన్నుకోమని చెప్పాలని అనిపిస్తుందని రాంగోపాల్ వర్మ అన్నారు

  •  
  •  
  •  
  •  

Comments