వర్మ- నాగ్ టైటిల్ అదేనా ?

Monday, January 22nd, 2018, 12:51:44 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్ని బడా సినిమాలు తెరకెక్కుతోన్న అందరి చూపు ఎక్కువగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ – అక్కినేని నాగార్జున సినిమాపైనే ఉంది. దాదాపు 20 ఏళ్ల తరువాత వీరి కాంబినేషన్ ఒకటవ్వడంతో తప్పకుండా సినిమాలో ఎదో ఒక మ్యాటర్ ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాపై ఇప్పుడు పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ శపథం అని అనుకుంటున్నట్లు టాక్. ఇక రివేంజ్ కంప్లీట్స్ అనే ట్యాగ్ లైన్ ని కూడా వర్మ ఆలోచిస్తున్నాడట. గతంలో సిస్టమ్ అనే టైటిల్ బాగా వినిపించింది. ఇక ప్రస్తుతం అయితే శపథం అనే టైటిల్ ను పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే వర్మ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే. ఇక సినిమాలో నాగార్జున సరసన మైరా సరీన్ నటిస్తోంది. ఏప్రిల్ లో సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా శివ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.