బాబోయ్ .. టాలీవుడ్ లోకి వర్మ వైరస్ ?

Sunday, June 10th, 2018, 11:56:12 PM IST

సంచలనాలా వర్మ తాజాగా తీసిన ఆఫీసర్ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. కనీసం తన ప్లాపుల నుండి నాగార్జున బయటపడేస్తాడని అనుకున్నాడు వర్మ .. కానీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. తన సినిమాలు హిట్టా .. ఫట్టా అన్న విషయాన్నీ ఏమాత్రం పట్టించుకుకుండా వరుసగా సినిమాలు తీసే వర్మ అప్పుడే తన నెక్స్ట్ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు? తాజాగా టాలీవుడ్ మీదికి వైరస్ వదులుతాడట ! తన తదుపరి సినిమా గురించి వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ సినిమా వైరస్. సర్కార్ , ఎటాక్స్ 26/11 చిత్రాలను నిర్మించిన పరాగ్ సంఘ్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని తెలిపాడు. అంతే కాదండోయ్ ఈ సినిమా కథ గురించి కూడా చెప్పేసాడు .. విద్యార్థి మధ్య ఆఫ్రికాకు వెళ్తాడట అక్కడనుండి ముంబై వచ్చాక భయంకరమైన వ్యాధితో బాధ పడుతుంటాడు. ఈ వ్యాధి ముంబై మొత్తం వ్యాపిస్తుందట, దాన్ని కనిపెట్టే క్రమంలో ప్రభుత్వం .. ప్రజలు పడే ఇబ్బందులే ఈ స్టోరీ అంట !! అన్ని రకాల ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా గురించి నిజమైన పరిశోధన చేసి ఈ సినిమా తీస్తున్నాడట !!

  •  
  •  
  •  
  •  

Comments