ఫిలిం లవర్స్ గెట్ రెడీ .. వర్మ స్కూల్ పెట్టేస్తున్నాడు?

Sunday, May 27th, 2018, 09:23:51 AM IST

సంచలన దర్శకుడు వర్మ .. ఓ ఫిలిం స్కూల్ పెడుతున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే ప్రకటించాడు. అమెరికాలోని కొందరి భాగస్వామ్యంతో ఈ స్కూల్ ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. దీనికి టైటిల్ ఏంటో తెలుసా ఆర్జీవీ ఆన్ స్కూల్ అనే పేరుతొ ఈ స్కూల్ నడవనుంది. సినిమా రంగంలో రాణించాలని కలలు కనే వారికి ఇది మంచి అవకాశం. వర్మ ఇప్పటికే తన శిష్యులను ఎంతో మందిని దర్శకులుగా మార్చడానికి సొంత బ్యానర్ పై పలు సినిమాలు తీసిన విషయం తెలిసిందే. ఇక వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా జూన్ 1న విడుదల కానుంది. మరి వర్మ పెట్టె స్కూల్ ముంబై లో పెడతారా .. లేదా హైద్రాబాద్ లోనా అన్నది తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments