జనసేన ప్రజారాజ్యం కంటే దారుణం.. ప్రజలారా మేల్కొండి: వర్మ

Saturday, February 17th, 2018, 12:09:12 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన వైరల్ అవ్వడం ఈ రోజుల్లో చాలా కామన్. అయితే చాలా రోజుల తరువాత వర్మ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవిలా మారిపోతున్నాడని.. ఏపీ ప్రజలు మేలుకోవాలని మెస్సేజ్ ఇచ్చాడు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులతో కలవడం ద్వారా పవన్ కల్యాణ్ మరో ఘనతను అందుకున్నాడు.

నెక్స్ట్ ఎలక్షన్ లో గొప్ప నమ్మకంతో అన్ని నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేయాలని చెబుతూ.. లేకుంటే చిరంజీవి కన్నా పెద్ద తప్పు చేసినవాడవుతాడని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇక మరో ట్వీట్ లో.. జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ కల్యాణ్ ఓ సింహంలా కనిపించాడు అంతే కాకుండా ఆయన మాటలు సింహ ఘర్జనను మర్చిపోయేలా చేశాయి..కానీ ఇప్పుడు వివిధ సెక్షన్లకు సంబంధించిన వ్యక్తులను ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని పవన్ కళ్యాణ్ అడుక్కోవడం చూస్తుంటే.. చిరంజీవిలా మారిపోతున్నారని వర్మ కామెంట్ చేశాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవిలా మారిపోకముందే ఏపీ ప్రజలు మేల్కోవాలని, లేకుంటే జనసేన ప్రజారాజ్యం కంటే దారుణంగా మారుతుందని పేర్కొన్నారు.