డాన్ దావూద్‌పై ఆర్జీవీ వెబ్ సిరీస్‌

Thursday, July 26th, 2018, 12:27:55 PM IST

ముంబై అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై వెబ్ సిరీస్ తెర‌కెక్కించేందుకు ఆర్జీవీ అలియాస్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌ రెడీ అవుతున్నారు. ఈ సంగ‌తిని వ‌ర్మ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా వేడి పెరిగింది. పాకిస్తాన్‌, దుబాయ్ వంటి చోట్ల త‌ల దాచుకుంటూ ముంబై పోలీసుల్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న దావూద్ చ‌నిపోయాడ‌ని కొంద‌రు, లేదు ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని మ‌రికొంద‌రు చెబుతుంటారు. అత‌డిని ప‌ట్టిచ్చిన‌వారికి భారీగా బ‌హుమతిని ముంబై క్రైమ్ పోలీస్ ప్ర‌క‌టించారు అప్ప‌ట్లో.

ఇప్పుడు అలాంటి ప్ర‌మాద‌క‌ర మాఫియా డాన్ గురించి మ‌న‌కెందుకు? అనుకోవ‌డానికి లేదు. అత‌డిపై వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తానంటూ వివాదాల వ‌ర్మ అగ్గి రాజేశాడు. 1993 ముంబై సీరియ‌ల్ బాంబ్ బ్లాస్ట్స్ , బాబ్రీ మ‌సీదు అల్ల‌ర్లు, సినీతార‌లతో దావూద్ సంబంధాలు ఇత‌ర‌త్రా విష‌యాల్ని ఈ ఐదు సీజ‌న్‌ల‌ సిరీస్‌లో చూపిస్తాడ‌ట‌. 20ఏళ్లుగా ముంబై మాఫియాతో త‌నకు ఉన్న స‌త్సంబంధాల ద్వారా సేక‌రించిన స‌మాచారంతో ఈ వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తాన‌ని తెలిపాడు ఆర్జీవీ. 5 సీజన్లలో 10 ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంద‌ని వెల్ల‌డించారు. ఇక‌పోతే అస‌లు డాన్ దావూద్‌ని ముంబై పోలీస్ ఎందుకు ప‌ట్టుకోలేక‌పోయారో వ‌ర్మ చూపిస్తాడేమో? అన్న కుతూహాలం అభిమానుల్లో పెరుగుతోంది. మ‌రి వ‌ర్మ ఏం చేస్తాడో?

  •  
  •  
  •  
  •  

Comments