ఆర్జీవీ అడ‌వి గుర్రంలాంటోడు!-నాగార్జున‌

Thursday, May 31st, 2018, 06:28:02 PM IST

రామ్‌గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవీ అడ‌వి గుర్రంలాంటోడు. అత‌డు సినిమాని గ‌ట్టెక్కిస్తాడో లేదో తెలీదు. మ‌ధ్య‌లోనే వేరొక ప్రాజెక్టు ఉందేమోన‌న‌ని వ‌దిలి వెళ్లిపోతాడేమోన‌ని భ‌య‌ప‌డ్డాను.. అని అన్నారు కింగ్ నాగార్జున‌. అయితే ఆఫీస‌ర్ విష‌యంలో అలా చేయ‌కుండా ప‌ట్టుద‌ల‌గా చేశాడ‌ని నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు. నేడు అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించిన నాగార్జున ఆఫీస‌ర్ త‌ప్ప‌నిస‌రిగా విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమాని క‌న‌బ‌రిచారు.

ఆర్జీవీ అస‌లు ఆ టైటిల్ ఎందుకు.. పాత్ర పేరునే టైటిల్ గా పెట్టుకోవ‌చ్చు క‌దా.. అన్న ప్ర‌శ్న‌కు ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్ప ందించారు. “ఈ సినిమాలో హీరో ఆఫీస‌రే.. విల‌నూ ఆఫీస‌రే. అందుకే ఆ టైటిల్ పెట్టుకున్నాం“ అని అన్నారు నాగార్జున‌. ఈ శుక్ర‌వారం రిలీజ్ సంద‌ర్భ ంగా అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో చిత్ర‌బృందం ముచ్చ‌టించింది. రామ్‌గోపాల్ వ‌ర్మ వైల్డ్ హార్స్ లాంటోడు. మొద‌ట అత‌డంటే నాకు న‌మ్మ‌కం లేదద‌ని, ఆరంభం క‌థతో వ‌చ్చిన‌ప్పుడు చూద్దాంలే అన్నాన‌ని నాగార్జున తెలిపారు.