చియాన్ విక్రమ్ సరసన `పెళ్లి చూపులు` భామ నటించడమేంటి? .. డౌట్ బాగానే ఉంది. కానీ ఇది నిజమే. పెళ్లి చూపులు చిత్రంతో సత్తా చాటుకున్న రీతూవర్మను ఈ అరుదైన అవకాశం వరించింది. ఈ సినిమా తన కెరీర్‌కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. ఎన్నో విలక్షణ సినిమాలతో తనదైన ముద్ర వేసిన చియాన్ విక్రమ్ అంత పెద్ద స్టార్ సరసన ఓ తెలుగమ్మాయికి కథానాయికగా ఛాన్స్ ఇవ్వడం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్రస్తుతం రీతూ వర్మ- చియాన్ జంటగా నటిస్తున్న సినిమా `ధృవనక్షత్రం` ఆన్‌సెట్స్ ఉంది. రీతూ కూడా షూటింగులో పాల్గొంటోంది.
తెలుగులో అడపాదడపా చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ని సాగించే రీతూవర్మ అనూహ్యంగా పెద్ద స్టార్ అయిపోయిందిప్పుడు. విక్రమ్ సరసన నటించాల్సిన వేరొక భామ అనూ ఇమాన్యుయేల్.. చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రీతూవర్మను దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకున్నారు. అలా జాక్ పాట్ కొట్టేసిందన్నమాట. రీతూవర్మ ఇదివరకే ప్రేమ ఇష్క్ కాదల్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్ దేవరకొండ దర్శకత్వంలో `పెళ్లి చూపులు` చిత్రంలో నటించి మరో బ్లాక్‌బస్టర్ అందుకుంది. దాంతో పాటే నటిగానూ చక్కని పెర్ఫామర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.