అధికార పార్టీ ఎంపీ ఇంట్లో దొంగలు..15 లక్షలు గోవిందా..!!

Wednesday, September 27th, 2017, 12:24:24 PM IST


అధికార టిఆర్ఎస్ పార్టీ ఎంపీ నగేష్ ఇంట్లో బుధవారం తెల్లవారు జామున దొంగలు పడ్డ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు తమ పనిని సులభంగా ముగించారు. నగదుతో కలిపి రూ 15 లక్షల విలువైన ఆభరణాలని దొంగిలించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఓ కార్యక్రమం నిమిత్తం ఎంపీ నగేష్ బయటకు వెళ్లారు. ఆ సమయం లో ఇంట్లో ఎవరూ లేరు.

దొంగిలించడానికి ఇదే అనువైన సమయం అని భావించిన దొంగలు సిసి కెమెరాలని ధ్వంసం చేసి, ఇంటి తలుపులని పగలగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, 71 వేల నగదుతో ఉడాయించారు. ఆదిలాబాద్ లోని ఎంపీ నివాసం లో ఈ ఘటన జరిగింది. ఎంపీ అనుచరులు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎంపీ ఇంటికే భద్రత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ డిఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని ఎంపీ నివాసాన్ని పరిశీలించారు.

  •  
  •  
  •  
  •  

Comments