కాలా దెబ్బకు రోబో 2 వెనక్కి వెళ్లిందా ?

Wednesday, February 7th, 2018, 12:52:34 PM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటిస్తున్న రోబో 2. 0 సినిమా కోసం అయన ఫాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 2010 లో వచ్చిన రోబో చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపడమే కాకుండా అటు ప్రేక్షకులను తన మాయలో పడేసింది చిట్టి అలియాస్ రోబో .. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్నా ఈ సినిమా విడుదల విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి ..శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు .. ఇంతలోనే మరోసారి వాయిదా పడుతున్నట్టు తెలిసింది. ఈ సారి వాయిదాకు కారణం ఎవరో కాదు రజని కాంతే !! అవును రోబో 2. 0 తో పాటు అయన కాలా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుంది. షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తామంటూ చెప్పేసారు. అయితే రోబో 2 సినిమాకు సంబందించిన గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తీ కాకపోవడం వల్లే .. కాలా ను ముందు విడుదల చేస్తారని టాక్. ఇక రోబో 2. 0 చిత్రాన్ని జూన్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.